దళితుల కోసం ధర్నా చేస్తా
మాజీ సీఎం కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ – బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దళితుల కోసం అవసరమైతే ధర్నా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. లక్షా 30 వేల మంది దళితులతో తాను సచివాలయానికి వస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు ఇవ్వలేదని ప్రశ్నించారు కేసీఆర్.
కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతానని, దళిత బంధు కింద డబ్బులు ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ సీఎం. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పడకేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలించడం చేత కాదన్నారు .
అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలుగా ఓట్లు పొంది పవర్ లోకి వచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేస్తామని చెప్పి వాటి గురించి ప్రస్తుతం ఊసెత్తడం లేదన్నారు .
దళితులు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. ఇక రాబోయే కాలంలో బీఆర్ఎస్ దూసుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు కేసీఆర్. సీఎం మెడలు వంచుతానని ధర్నా చేపట్టి దళితులకు న్యాయం చేసేంత దాకా నిద్ర పోనంటూ హెచ్చరించారు కేసీఆర్.