బీఆర్ఎస్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఒకరి వెంట మరొకరు క్యూ కట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సైతం ఓకే అంటే వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ గా ఉన్నారు.
ఈ తరుణంలో ఇప్పటికే కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు వెంకటేశ్ నేత షాక్ ఇచ్చారు. రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో చేరారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ సైతం జంప్ అయ్యారు. తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి , ఎమ్మెల్సీ తాండూరు నియోజకవర్గానికి చెందిన పట్నం మహేందర్ రెడ్డితో పాటు భార్య, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
వీరు కూడా చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో పూర్తి పట్టు కలిగిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ షాక్ ఇచ్చారు. 22 ఏళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఉన్నట్టుండి జంప్ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.