డిఫెన్స్ రంగంపై విస్తృత స్థాయిలో చర్చ
అమరావతి – డీఆర్డీఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి. సతీష్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పటానికి గల అవకాశాల గురించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్, అమలాపురం ఎంపీ హరీష్ పాల్గొన్నారు. అంతకు ముందు విజయవాడలో దాదాపు 50 మంది పారిశ్రామికవేత్తలతో సతీష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో పరిశ్రమలు నెలకొల్పటానికి గల అనుకూలతలపై చర్చించారు.
ఈ సమావేశంలో కీలక అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. జి. సతీష్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుతో. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా రక్షణ రంగంలో పారిశ్రామిక అభివృద్ధి అవకాశాల అవలోకనాన్ని ఆయన ప్రదర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మద్దతు ఇవ్వడానికి డాక్టర్ సతీష్ రెడ్డి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ మద్దతును ఆయన కోరారు. సతీష్ రెడ్డి చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులకు త్వరిత అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు, భూమి కేటాయింపును కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.