ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం
మాజీ మంత్రి నారాయణ
అమరావతి – మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ మంగళవారం మర్యాద పూర్వకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాలు గెలుపొందడమే కాకుండా అధికారంలోకి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా మార్చి 2న చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు నారాయణ చంద్రబాబుతో. నెల్లూరు జిల్లాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు గాను అన్నింట్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపొందేలా తాను శాయ శక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ మేరకు ఇప్పటి నుంచే పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేశానని తెలిపారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈనెల జిల్లాలో పర్యటించే చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతామని, ఇదే సమయంలో ఇటీవలే తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటారని స్పష్టం చేశారు.