ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి
అనంతపురం జిల్లా – ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ సందర్బంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బలమైన నాయకుడని, తనను ఎవరూ ఎదుర్కోలేక పోయారని అన్నారు.
తనకు ధీటుగా నిలబడి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రమేనని కుండ బద్దలు కొట్టారు. ఇదే సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు చాలా మంది లీడర్లను తొక్కేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తను మాత్రమే ఉండాలని కేసీఆర్ కోరుకున్నాడని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. విచిత్రం ఏమిటంటే కేతిరెడ్డి జగన్ రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి.
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతపురం జిల్లా నుంచి మంత్రిగా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బూమ్ రాంగ్ అయ్యాయని అన్నారు. లిక్కర్, ఇసుక పాలసీలు దెబ్బ కొట్టాయన్నారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి, చంద్రబాబు అరెస్టు, భువనేశ్వరిని తిట్టడం వంటి ఘటనలు వైసీపీ ఓటమికి కారణం అయ్యాయని ఒప్పుకున్నారు.