NEWSANDHRA PRADESH

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

Share it with your family & friends

ఆహ్వానించిన వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ త‌రుణంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో వైసీపీ ఉంది. ఎలాగైనా స‌రే జ‌గ‌న్ రెడ్డిని ఇంటికి సాగ‌నంపాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాయి పార్టీలు.

ఇదిలా ఉండ‌గా వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సార‌థ్యంలోని ఏపీపీసీసీ ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఆ పార్టీలోకి వ‌ల‌స‌ల సంఖ్య పెరిగింది. క‌ర్నూలు జిల్లా నందికోట్కూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఉన్న‌ట్టుండి జ‌గ‌న్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తాను గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ప‌రిగెల ముర‌ళీ కృష్ణ ఊహించ‌ని రీతిలో షాకిచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆయ‌న చేరితో పార్టీకి మ‌రింత బ‌లం చేకూరింద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రికంద‌రు నేత‌లు త‌మ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు.