NEWSTELANGANA

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి వైర‌ల్

Share it with your family & friends

టెలి కాన్ఫ‌రెన్స్ వాయిస్ రికార్డ్ హ‌ల్ చ‌ల్

న‌ల్ల‌గొండ జిల్లా – రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన హుజూర్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలి కాన్ఫ‌రెన్స్ వాయిస్ రికార్డు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఢిల్లీ నుంచి హఠాత్తుగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది…నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండువా కప్పుకున్నాన‌ని అన్నారు. తెలంగాణ లో మోడీ గాలి వీస్తోంద‌ని , ఆ పార్టీకి 10 నుంచి 12 సీట్లు గెలిచే అవ‌కాశాలు ఉన్నాయంటూ నోరు పారేసుకున్నారు.

దేశంలో బీజేపీ ప్ర‌భంజ‌నం త‌ప్ప‌ద‌ని, ప్ర‌ధానిగా మోదీ తిరిగి కొలువు తీరుతార‌ని అన్నారు సైది రెడ్డి. బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారని…ఆర్ధిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి కూడా జ‌డుసు కుంటున్నార‌ని, అందుకే వారు పోటీ నుండి త‌ప్పుకున్నార‌ని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారని….ఆ వ్యతిరేక బ్యాచ్ కు బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తాను హుజూర్ నగర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కు ఒక్క సర్పంచ్ కూడా లేడని కానీ ఇవాళ ఆ పార్టీని ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లాన‌ని అన్నారు.