బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్
అమరావతి – టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు. జగన్ కు తెలిసే జరుగుతోందని, దాని వెనుక బిగ్ ప్లాన్ ఉందన్నారు. తమపై నమోదైన కేసులను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి నాటకాలకు తెర లేపారంటూ ధ్వజమెత్తారు. రాజీనామాలు చేసినా విదేశాలకు వెళ్లినా చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపడం ఖాయమన్నారు.
చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలు అన్నారు. విజయసాయి రెడ్డి చంద్రబాబును అన్న ప్రతి మాట తమకు గుర్తుందన్నారు. చేసినవన్ని చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదదన్నారు బుద్దా వెంకన్న.
ఆయన చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాల్సి ఉందన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి CBI అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం విజయసాయిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.