Saturday, April 19, 2025
HomeNEWSమాజీ ఎమ్మెల్సీ స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత

మాజీ ఎమ్మెల్సీ స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత


కేసీఆర్..కేటీఆర్..హ‌రీశ్ తీవ్ర దిగ్భ్రాంతి

హైద‌రాబాద్ – మాజీ సీఎంకు అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ . స‌త్య‌నారాయ‌ణ ఆదివారం క‌న్ను మూశారు. ఆయ‌న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో స‌భ్యుడిగా కూడా ప‌ని చేశారు. తెలంగాణ ఉద్యమంలో రెండవ దశలో కీలక పాత్ర పోషించారు. జ‌ర్న‌లిస్ట్ గా గుర్తింపు పొందారు. ఆయ‌న దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు.

త‌న వ‌య‌సు 58 ఏళ్లు. సంగారెడ్డిలో త‌న ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల కేసీఆర్, కేటీఆర్, క‌విత‌, హ‌రీశ్ రావు సంతాపం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ఆర్ స‌త్య నారాయణ‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి జర్నలిజంను విడిచిపెట్టారు. ఆయన పూర్వ మెదక్ జిల్లాకు బిఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు . సంగారెడ్డిలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ పోషించిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని అన్నారు. పార్టీ గొప్ప నాయ‌కుడిని, నిబ‌ద్ద‌త క‌లిగిన జ‌ర్న‌లిస్టును కోల్పోయింద‌న్నారు. ఒక ర‌కంగా త‌న‌కు అత్యంత ఆత్మీయుడ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments