NEWSTELANGANA

మాజీ ఫ్రొఫెస‌ర్ ఎన్ సాయిబాబా ఇక లేరు

Share it with your family & friends

దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపం

హైద‌రాబాద్ – జీవిత కాలమంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన మాజీ ప్రొఫెస‌ర్ , మాన‌వ హ‌క్కుల ప్రేమికుడు ఎన్ . సాయి బాబా తీవ్ర అనారోగ్యంతో క‌న్ను మూశారు. ఆయ‌న మృతితో గొప్ప ప్ర‌జా నాయ‌కుడిని కోల్పోయింది. ఆయ‌న గ‌తంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీతో పాటు ఢిల్లీ విశ్వ విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశారు. కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన ప‌డ్డారు. చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతూ శ‌నివారం తుది శ్వాస విడిచారు.

నిషిద్ద మావోయిస్టు గ్రూప్ ల‌తో ఎన్. సాయి బాబాకు సంబంధాలు ఉన్నాయ‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో చిత్ర హింస‌ల‌కు గురి చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్ . సాయి బాబాకు మోక్షం ల‌భించింది. ఇటీవలే ఆయ‌న బెయిల్ పై విడుద‌ల‌య్యారు. విచిత్రం ఏమిటంటే 10 సంవ‌త్స‌రాల పాటు మ‌హారాష్ట్ర లోని నాగ్ పూర్ జైలులోనే గ‌డిపారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది మార్చిలో విడుద‌ల‌య్యారు.

గ‌త నెల సెప్టెంబ‌ర్ లో గ్లాడ్ బ్లాడ‌ర్ శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. స్టంట్ వేసిన చోట చీము ప‌ట్ట‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. చివ‌ర‌కు క‌న్ను మూశారు. ఈ దేశం మాన‌వ హ‌క్కుల కోసం ఉద్య‌మించిన వ్య‌క్తిగా ఎప్ప‌టికీ గుర్తుండి పోతారు ఎన్. సాయి బాబా. హ‌క్కుల ప్రేమికుడే కాకుండా గొప్ప ర‌చ‌యిత కూడా.