లోక్ పాల్ చైర్ పర్సన్ గా ఖాన్విల్కర్
నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ – దేశంలోనే అత్యున్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన లోక్ పాల్ సంస్థకు చైర్ పర్సన్ గా ప్రముఖ మాజీ న్యాయమూర్తి జస్టిస్ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము లోక్ పాల్ చైర్ పర్సన్ గా నియమించారు.
వీరితో పాటు న్యాయ రంగంలో అపారమైన అనుభవం కలిగిన మరికొందరు న్యాయమూర్తులను సభ్యులుగా నియమించారు రాష్ట్రపతి. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర సర్కార్. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ సూచనల మేరకు వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా నూతనంగా నియమించిన లోక్ పాల్ సంస్థలో సభ్యులుగా కర్ణాటకకు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ లింగప్ప స్వామి, మాజీ అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ యాదవ్ , మాజీ కర్ణాటక హెచ్ సీ సీజే జస్టిస్ రీతూ రాజ్ అవస్థి ని నియమించారు. కాగా ప్రస్తుతం లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ గా ఉండడం విశేషం.
లోక్ పాల్ చైర్ పర్సన్ గా నియమితులైన ఖాన్విల్కర్ ను , సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ చంద్రచూడ్.