జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్
చిత్తూరు జిల్లా – జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయిన కిరణ్ రాయల్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తాను మరిచి పోలేనని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కావాలని కొందరు తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నిజం నిలకడ మీద తేలుతుందన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, తాను సహకరించడం జరిగిందన్నారు. తనను నమ్మి పార్టీ ఇంఛార్జ్ పోస్టు ఇచ్చారని తెలిపారు. అందుకే తనకు పవన్ అంటే ఇష్టమన్నారు. ఇదిలా ఉండగా లక్ష్మి అనే మహిళను దారుణంగా మోసం చేశారని బాధితురాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
గురువారం రాయల్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. తన అంశానికి సంబంధించి చిన్న సమస్య అని కొట్టి పారేశారు. తాను కచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తానని ప్రకటించాడు. తనపై ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడని, అందుకే ధైర్యంగా విచారణకు ఆదేశించారని చెప్పారు రాయల్ కిరణ్.
ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా తాను పవర్ స్టార్ ను విడిచి ఉండలేనని స్పష్టం చేశారు.