జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఫోకస్
తిరుపతి జిల్లా – తిరుమల భద్రత, సేఫ్టీ మెథడ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు జిల్లా ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు. పోలీసు సిబ్బంది తోపాటు విజిలెన్స్ , హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి మెట్లు, ఆదిశేషు గెస్ట్ హౌస్, ఎమ్. బీ. సీ-34 ప్రాంతం తోపాటు ఎస్.ఎం. సి,ఏ.టీ.సీ. పరిసర ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.తిరుమలలోని బాంబు స్వ్కాడ్ , డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలను వేగవంతం చేశారు. ఇతర ప్రాంతాల నుండి కూలీ పనుల పై వచ్చి నివాసాలు ఉంటున్న వారి వివరాలు సేకరించారు.
ఏఏ ప్రాంతాల నుండి ఎంత మంది ఇక్కడ పని చేస్తున్నారు అంతే కాకుండా వారు ఏ భాష మాట్లాడుతున్నారు అనేదాని పైన కూడా ఆరా తీశారు. అక్కడ పనులు నిర్వహిస్తున్న వారి వివరాలతో పాటు వారి వేలు ముద్రలు, ఐరిష్ చెకింగ్ చేపట్టారు. నివాసాలతో పాటు బ్యాగులను కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు.
తిరుమలలో గుడిసెలు వేసుకుని ఉంటున్న వారిని పంపించి వేశారు. ఎప్పటి నుంచో నిర్మిస్తున్న కట్టడాలను బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో అక్కడ ఉన్న వస్తువులను తనిఖీలు చేశారు. యాత్రికులు ఫోటోలు తీసి ఇచ్చేటువంటి ఫోటోగ్రాఫర్స్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.