NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుతో ఎఫ్1హెచ్20 ఫౌండ‌ర్ భేటీ

Share it with your family & friends


కీలక అంశాల‌పై చ‌ర్చించిన నేత‌లు

అమ‌రావ‌తి – ఏపీలో కొత్త‌గా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నారా చంద్ర‌బాబు నాయుడును క‌లిసేందుకు ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు. దేశ‌, విదేశాల‌లో పేరు పొందిన కంపెనీల‌కు చెందిన సిఇఓలు, చైర్మ‌న్లు , వ్యాపార‌వేత్త‌లు క‌లుసుకుంటున్నారు.

ఏపీ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, కార్పొరేట్ కంపెనీల‌కు వెసులుబాటు క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు ఏపీ సీఎం . ఇదిలా ఉండ‌గా వివిధ దేశాల‌కు చెందిన రాయ‌బారులు ఇటీవ‌లే సీఎంను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.

తాజాగా ఎఫ్1హెచ్ 20 వ్య‌వ‌స్థాప‌కుడు భార‌త దేశంలో ప‌ర్య‌టించారు. గ‌తంలో సీఎంగా ఉన్న స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్న క్ర‌మంలో విష‌యం తెలుసుకున్న ఆయ‌న బాబుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న ముందు చూపు, దూర దృష్టి క‌లిగిన అరుదైన నాయ‌కుడు అని కొనియాడారు ఎఫ్1 హెచ్ 20 ఫౌండ‌ర్. ఇరువురి మ‌ధ్య చాలా సేపు సుదీర్ఘ సంభాష‌ణ కొన‌సాగింది.