రైతుల ఢిల్లీ ఛలో ఆందోళన
పార్లమెంట్ ముట్టడికి యత్నం
న్యూఢిల్లీ – రైతన్నలు మరోసారి కదం తొక్కారు. పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దేశ రాజధాని రైతులతో నిండి పోయింది. మరో వైపు వారిని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
వివిధ రైతు సంఘాలన్నీ ఒక్కటై ఢిల్లీ ఛలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. వేలాదిగా రైతులు తరలి వచ్చారు. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
అందుకే మరోసారి తమ ఆందోళనను, పోరాటాన్ని తెలియ చెప్పేందుకు ఇక్కడికి వచ్చామని అన్నారు భారతీయ కిసాన్ నాయకుడు సుఖ్ బీర్ ఖలిఫా. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేదే లేదన్నారు.
ఎంఎస్పీ కోసం తాము గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా కావాలని పక్కన పెట్టారంటూ ఆరోపించారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన చెందారు. తాము పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటామని ప్రకటించారు.