NEWSNATIONAL

క‌దం తొక్కిన్న రైత‌న్న‌లు

Share it with your family & friends

టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగం

న్యూఢిల్లీ- పంజాబ్ హ‌ర్యానా స‌రిద్దు ఉద్రిక్తంగా మారింది. రైతులు మ‌రోసారి ఉద్య‌మ బాట ప‌ట్టారు. న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన మోదీ స‌ర్కార్ మ‌రిచి పోయిందంటూ మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం పంజాబ్ ..హ‌ర్యానా స‌రిహ‌ద్దును దాటేందుకు ప్ర‌య‌త్నం చేశారు వేలాది మంది రైతన్న‌లు.

రైతుల పోరాటం ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దీంతో ప‌లువురు రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. శంభు స‌రిహ‌ద్దు పాయింట్ వ‌ద్ద రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయితే తాము శాంతియుతంగా ఆందోళ‌న చేస్తుండ‌గా పోలీసులే కావాల‌ని త‌మ‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు.

ఇవాళ ఢిల్లీ ఛ‌లో పేరుతో పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. మొత్తం 200 రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. హ‌ర్యానా, పంజాబ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ నుండి ల‌క్ష మంది రైతులు దేశ రాజ‌ధానిలో క‌వాతు చేప‌ట్టారు. ఎందుకు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టు కోలేక పోయారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.