రైతన్నల పోరు బాట
దేశ రాజధానిలో రెడ్ అలర్ట్
ఢిల్లీ – తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతన్నలు ఢిల్లీ బాట పట్టారు. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. ఏ టైం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మోడీ ప్రభుత్వం తమను మోసం చేసిందని, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పి మాట మార్చిందంటూ రైతులు మండిపడ్డారు.
గత రౌండ్ లో జరిపిన చర్చలు విఫలం కావడంతో తిరిగి మరోసారి ఆందోళన బాట పట్టారు రైతన్నలు. భారతీయ కిసాన్ పరిషత్ ఈ పోరాటానికి పిలుపునిచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
భారతీయ కిసాన్ పరిషత్ (BKP) నాయకుడు సుఖ్‌బీర్ ఖలీఫా పార్లమెంట్ ను ముట్టడించి తీరుతామని ప్రకటించారు. గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీఘర్, ఆగ్రా సహా 20 జిల్లాల నుంచి రైతులు మార్చ్‌లో పాల్గొంటున్నారు.
పంటకు మద్దతు ధర ఇవ్వాలని, భూమి లేని పిల్లలకు రైతులకు ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.