ప్రధానమంత్రి మోడీని కలవడంపై గుస్సా
ఢిల్లీ – ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దౌసాంజ్ పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. సిక్కు అయి ఉండి ఓ వైపు రైతులంతా తమకు న్యాయం చేయాలని రేయింబవళ్లు ఆందోళన చేస్తుంటే దిల్జిత్ ఎలా పీఎంను కలుస్తాడంటూ ప్రశ్నించారు. తను వెళ్లాల్సింది మోడీ వద్దకు కాదని తమ వద్దకు రావాలని స్పష్టం చేశారు.
గతంలో పలుమార్లు దిల్జిత్ దౌసాంజ్ పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించాడు. రైతులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. అంతే కాకుండా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాడు. పోరాటాలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని తన పాటల ద్వారా చైతన్యవంతం చేస్తానని అన్నాడు .
కానీ అంత లోనే పీఎంను కలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు రైతులు, రైతు నాయకులు. వెంటనే తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. రేయింబవళ్లు కష్టపడే రైతులకు మద్దతు ఇవ్వకుండా మోసం చేస్తున్న మోడీని ఎలా కలుస్తావంటూ ధ్వజమెత్తారు.