యడ్యూరప్పపై పోక్సో కేసు
మాజీ సీఎంకు కోలుకోలేని షాక్
కర్ణాటక – రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్పకు కోలుకోలేని షాక్ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఊహించని రీతిలో కేసు నమోదు కావడం బీజేపీలో కలకలం రేపుతోంది.
బెంగళూరు లోని సదాశివ నగర్ పోలీసులు బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైనర్ బాలిక తల్లి స్వయంగా ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. బాధితురాలి వయసు 17 ఏళ్లు.
చీటింగ్ కేసులో సాయం కోసం సందర్శించిన సమయంలో లైంగిక వేధింపులకు మాజీ సీఎం పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి వాపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు.
అయితే కేసు నయోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీఎస్ యడ్యూరప్ప కుటుంబీకులు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో చేసిందే తప్పా ఇంకోటి కాదని పేర్కొన్నారు.