మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ఐదుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో వి.కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, పనబాక లక్ష్మి, సదాశివరావు, జ్యోతుల నెహ్రు ఉన్నారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ తో పాటు మొత్తం 24 మందిని సభ్యులుగా నియమించింది. వీరిలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చైర్మన్ గా బీఆర్ నాయుడుతో పాటు మరికొందరు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ మరో ఐదుగురితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, వీజీవోలు సురేంద్ర , రామ్ కుమార్, తదితరులు
పాల్గొన్నారు.