Friday, April 4, 2025
HomeDEVOTIONALఘ‌ణంగా శ్రీ‌వారి పుష్పాలంక‌ర‌ణ

ఘ‌ణంగా శ్రీ‌వారి పుష్పాలంక‌ర‌ణ

భారీ ఖ‌ర్చుతో దాత ఏర్పాటు

తిరుమ‌ల – వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా దాతల సహకారంతో శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఓ దాత అద్దాల మండపం సమీపంలో స్వామి, దేవేరుల నమూనా విగ్రహాలను ఉంచి అలంకరణ చేయడం జరిగింది.

ఇది గమనించిన అర్చక స్వాములు, ఆలయం లోపలి ప్రాంగణంలో నమూనా విగ్రహాలను తీసుకువచ్చి అలంకరణ చేయడం ఆలయ సంప్రదాయం కాదని సదరు దాతకు వివరించారు.

అర్చన స్వాములు సూచించిన సూచన మేరకు మిగిలిన పుష్పాలంకరణ లను పూర్తి చేసి సదరు దాత నమూనా విగ్రహాలను బయటకు తీసుకెళ్లడం జరిగింది.

అలాగే సదరు దాత బయట వారితో లోపల జరిగిన విషయాన్ని ఆవేశంతో చెప్పానని, ఆ విషయాన్ని అన్యదా భావించవద్దని ఆలయ అధికారులను కోరారు.

కేవలం టిటిడి సూచించిన ప్రాంతంలో మినహా బయట విగ్రహాలను తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోపల అలంకరణ చేయరాదని దాతలకు సూచించడమైనది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments