బీజేపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత
అమరావతి – అధికారం కోల్పోవడంతో వైసీపీని కీలక నేతలు వీడుతున్నారు. ఒక్కరొక్కరు జగన్ రెడ్డిని కాదంటున్నారు. నిన్నటి దాకా బాకాలు భజంత్రీలు ఊదిన వారంతా జై కూటమి అంటూ ఊదరగొడుతున్నారు. తాజా వైసీపీ నుంచి మరో వికెట్ పడింది. కీలకమైన నాయకుడిగా ఉంటూ వచ్చిన కె. రవిచంద్రారెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు.
ఉన్నట్టుండి తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ఇక ఉండలేనంటూ పేర్కొన్నారు. తన వల్ల కావడం లేదంటూ స్పష్టం చేశారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు కె. రవి చంద్రా రెడ్డి.
తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖను పార్టీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి పంపించానని చెప్పారు. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా రవి చంద్రా రెడ్డి కమలం పార్టీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యారు.
ఏపీ బీజీపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్య కుమార్ యాదవ్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఇన్నాళ్ల పాటు వైసీపీలో గుర్తింపు కల్పించినందుకు జగన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రవిచంద్రారెడ్డి.