తమిళనాట తలైవాకు గుడి
గుడి నిర్మించిన మాజీ అధికారి
తమిళనాడు – తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు తలైవా రజనీకాంత్. ఆయనకు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తమిళనాట విచిత్రమైన అభిమానులు ఉంటారు. వారు అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడరు.
సినిమాలన్నా, హీరోలు, హీరోయిన్లంటే పిచ్చి. గతంలో దివంగత జయలలిత కోసం విగ్రహాలు , గుడులను నిర్మించారు. అంతే కాదు బ్యూటిఫుల్ నటిగా పేరు పొందిన ఖుష్బూకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ 74వ పుట్టిన రోజు సందర్బంగా గుడి కట్టారు.
తన అభిమానాన్ని చాటుకున్నాడు మధురై జిల్లా తిరుమంగళంలోని మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్. ఈ విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తు, 300 కిలోల బరువుతో తయారు చేశారు. ప్రతి రోజూ పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, గంధం వంటి ద్రవ్యాలతో రజనీకాంత్ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సూపర్ స్టార్ కు మాజీ సైనిక అధికారి విగ్రహాన్ని నిర్మించడం చర్చనీయాంశంగా మారింది.