Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHమాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దు

మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దు

మాజీ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

విజ‌య‌వాడ – ప‌ర‌భాషా వ్యామోహంలో ప‌డ‌వ‌ద్ద‌ని , నేర్చుకోవ‌డంలో త‌ప్పు లేద‌న్నారు మాజీ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. తెలుగు భాష‌ను మ‌రిచి పోవ‌ద్ద‌ని కోరారు. ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భలు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రాను రాను తెలుగు క‌నిపించ‌కుండా పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దానిని బ‌తికించు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు.

తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. తెలుగు సాహిత్యం, వైభవం గొప్ప‌ద‌న్నారు. తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయార‌ని గుర్తు చేశారు.

తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని చెప్పారు మాజీ సీజేఐ . తెలుగు ఉనికి అతి ప్రాచీన భాష గా గుర్తింపు పొందిందన్నారు.

పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. ఒక సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అన్నారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగ దొక్కారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదంటూ వాపోయారు. వాడుక భాష లో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదన్నారు. తెలుగు భాష వృద్ది పై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టలేద‌న్నారు. కొన్ని దేశాల్లో వారి మాతృ భాషలో విద్యా బోధన చేసి అద్భుతాలు సాధించారని చెప్పారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయని అన్నారు.

భవిష్యత్తు తరాలకు మాతృభాష పై ఒక గౌరవం కలిగించాయన్నారు. ఆ తరహాలో మన తెలుగు భాష కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పర భాషను నేర్చుకోండి కానీ వ్యామోహం పెంచుకోకండని సూచించారు.
పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారని అన్నారు.

తెలుగు భాష లో‌చదివి… దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నార‌ని చెప్పారు. ప్రజా బాహిళ్యంలో మాతృభాష లోనే అన్ని నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలన్నారు.

తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుందన్నారు. మన ఆచార, వ్యవహారాలు సక్రమంగా అమలు చేయాలన్నారు. అభివృద్ధి తో పాటు భాషా సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్నారు. యన్టీఆర్‌ వంటి వారి వల్ల మన భాషకు, మన తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందన్నారు.

మానవ బంధాలతో కుడిన రచనలే కలకాలం ప్రజల్లో నిలుస్తాయన్నారు. కన్యాశుల్కం వంటి రచనలే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కన్నా… సమాజాన్ని మేల్కొలిపే రచనలే మిన్న అని చెప్పారు.

తెలుగు భాషను పరిపుష్టం చేయాలనే అలోచన పై ప్రభుత్వం సానుకులంగా స్పందించాలని సూచించారు. పత్రికలు, టివి ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.

లేదంటే భవిష్యత్తు లొ తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదన్నారు. తమిళనాడు లో అక్కడ భాషాభివృద్ధి కి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ప్ర‌శంసించారు. ఆ తరహాలో మన దగ్గర పాలకులు స్పందించడం లేదని ఆరోపించారు. తెలుగు భాషకు మద్దతు ఇచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించాల‌ని అన్నారు. అప్పుడే మన భాష అభివృద్ధి , వైభవం తప్పకుండా సాకారం అవుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments