శాసన సభలో కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ – తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ కు హాజరయ్యారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. రేపటి నుంచి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు .సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలిపారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలను ఆచరణకు నోచుకోని హామీల పేరుతో నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజలు సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కావాలని ఏ ఒక్క పథకం అమలు చేయడం లేదన్నారు.