ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
మాజీ సీఎం ముహూర్తం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుకోని రీతిలో రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అధికారం నుండి కోల్పోయారు. ఇది ఊహించని పరిణామం. తను బతికి ఉన్నంత దాకా సీఎంగా ఉంటానని అనుకున్నారు. ఆ మేరకు దారులు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
పార్టీని బలోపేతం చేయడంలో, దానిని మరింత ఆదాయ వనరుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. కానీ మితి మీరిన అహంకార పూరిత ధోరణి చివరకు పవర్ ను కోల్పోయేలా చేసింది. తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చినా ఆ తర్వాత అభివృద్ది పేరుతో ఎనలేని విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు తాజాగా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్. అనూహ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ ఓడి పోయారు. ఆయనతో పాటు ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించారు బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి.
తాజాగా ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ముహూర్తం కూడా నిర్ణయించారు.