మాజీ సీఎం మాయావతి భావోద్వేగం
హిందువులను తీసుకు రండి
ఉత్తరప్రదేశ్ – మాజీ సీఎం , బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలపై స్పందించారు. మైనార్టీలైన హిందువులు, క్రిష్టియన్లపై ఏకపక్షంగా దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని కోరారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరినీ యుద్ద ప్రాతిపదికన ఇండియాకు రప్పించాలని పీఎంకు విన్నవించారు. లేకపోతే మరికొందరు విలువైన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు కుమారి మాయావతి.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ దేశం కోసం పని చేయడంల లేదని ఆరోపించారు.
ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ సంభాల్ సంభాల్ అని అరుస్తోందని ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులు పెద్ద సంఖ్యలో దాడులకు లోనవుతున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా కుమారి మాయావతి బహిరంగంగా హిందువులకు అండగా నిలిచారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.