మీ విజయం అద్భుతం అపురూపం
అమరావతి – తొలిసారి నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్ ను భారత మహిళా, పురుష జట్లు గెలుచుకున్నాయి. ఇరు జట్లు ఫైనల్ లో నేపాల్ జట్లను ఓడించి రికార్డ్ బ్రేక్ చేశాయి. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. మీ విజయం అద్భుతమని, అపురూపమని పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు.
ఈ అసాధారణమైన గెలుపు భారతదేశపు పురాతన సాంప్రదాయ క్రీడలలో ఒకదానికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టేలా చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా లెక్కలేనంతమంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు పీఎం. రాబోయే కాలంలో మరింత మంది యువకులు ఈ క్రీడను కొనసాగించడానికి మార్గం సుగమం చేసిందన్నారు.
నేపాల్ ను 78-40 తేడాతో ఓడించారు. టోర్నీ మొత్తంగా భారత జట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది.