తంగలాన్ చిత్రం అద్భుతం – హర్షకుమార్
మాజీ కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర కామెంట్స్
అమలాపురం – మాజీ కాంగ్రెస్ పార్లెమెంట్ సభ్యుడు జీవీ హర్ష కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు , సామాజిక నేపథ్యం కలిగిన పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ ఎంపీ.
ఇవాళ తాను తంగలాన్ సినిమాను చూశానని, భారత దేశ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి సినిమా చూస్తానని అనుకోలేదని పేర్కొన్నారు మాజీ ఎంపీ.
చిన్నప్పుడు తాను హాలీవుడ్ కు సంబంధించిన బంగారం గురించి వేట సాగించే మూవీ మెకనాస్ గోల్డ్ ను గుర్తుకు తెచ్చేలా తంగలాన్ చేసిందన్నారు హర్షకుమార్.
ఇందులో ఫాంటసీ, థ్రిల్లర్, రియాలిటీ కలిసి ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బాహు బలి, కేజీఎఫ్ 1, 2 , సలార్ , కల్కి చిత్రాలకు మించి తంగలాన్ ఉందన్నారు మాజీ ఎంపీ. ఇలాంటి సినిమాను తీసినందుకు తాను పా రంజిత్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని ఆయన పేర్కొనడం విశేషం.