మాజీ సీఐడీ చీఫ్ సునీల్ పై ఫైర్
అమరావతి – మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కొందరు పార్టీలకు వంత పాడుతూ తమను తాము సూపర్ హీరోస్ గా ఫీలవుతూ వచ్చారని ఆరోపించారు. ఆయన నేరుగా మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఉద్దేశించి సీరియస్ గా స్పందించారు.
కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పదవిని కాపాడాలని అనుకోవడం విడ్డూరమన్నారు. దీనిని ప్రజలు ఎన్నడూ సహించ బోరంటూ స్పష్టం చేశారు పీవీ రమేష్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని, ఆయన అండ చూసుకుని పీవీ సునీల్ కుమార్ రెచ్చి పోయాడని ఆరోపించారు. తన సోదరిని ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ తరుణంలో సునీల్ కుమార్ చిత్రహింసలకు గురి చేయడంతో గత్యంతరం లేక విడాకులు ఇప్పించారు.
ప్రస్తుతం ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించారు పీవీ రమేష్. ఓ వైపు తప్పు చేస్తూ ఇంకో వైపు కులం పేరుతో రాజకీయం చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించ కూడదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తను దళితుడు కాబట్టే కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ అంబేద్కర్ సంఘాలు , నేతలు బయటకు రావడం, ఆందోళన చేపట్టడం విస్తు పోయేలా చేసిందన్నారు