మాజీ మంత్రి చింతా మోహన్ కామెంట్స్
అమరావతి – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జీల పోస్టులకు సంబంధించి వర్గీకరణ ఉండాలన్నారు. లక్షల కోట్ల బ్యాంకుల అప్పుల్లో కూడా ఎవరికి ఎంత వాటా అనేది తేల్చాలన్నారు. సీఆర్డీఏ కాంట్రాక్టుల సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. 33 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటే ఒకే సామాజిక బ్రాహ్మణ వర్గానికి చెందిన 20 మంది జడ్జీలు ఉండడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఏపీ హైకోర్టులో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జడ్జీలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు.
బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ. కానీ నేడు బ్యాంకులు ఇస్తున్న అప్పుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు ,ఓబిసీలకు ఇస్తున్న అప్పులు 1 శాతం. మిగిలిన 99 శాతం బ్యాంకు అప్పులు ఎవరికిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు చింతా మోహన్.
ఒకాయనకు 45 వేల కోట్లు రూపాయలు అప్పులిచ్చాయి. కానీ ఆ వ్యక్తికి మోడీ సాయం చేసి, 40 వేల కోట్లు రూపాయలు అప్పులు మాఫీ చేయించాడు. పవర్ ప్రాజెక్టు పేరుతో మళ్లీ ఇంకో 10 వేల కోట్లు రూపాయలు అప్పు కావాలని అడుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
సి ఆర్ డి ఏ కాంట్రాక్ట్ పనుల్లో ఎంత మందికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చారని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు దళిత విభజనే కారణమన్నారు. దళిత విభజన జోలికి పోతే చంద్రబాబు నష్ట పోతాడని, లోకేష్ కంటున్న కలలు కలలుగానే మిగులుతాయన్నారు.
తెలంగాణలో 100లో 90 మంది మాదిగలున్నారని. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వందలో 90 మంది మాలలు ఉన్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. నేను మాల, కాన్సిరాం మాదిగ మేమిద్దరం మంచి మిత్రులం. ఇరువురూ కలిసి ఒకే ప్లేటులో భోజనం చేశామన్నారు చింతా మోహన్.
ఎస్సీలు, ఓబీసీలు కలిసి ముందుకు పోయి, యూపీలో లాగా, ఏపీలో రాజ్యాధికారం వైపు పోవాలన్నదే నా కోరిక అని స్పష్టం చేశారు. స్టాలిన్, సిద్ధరామయ్య, మాలయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లు ఓబీసీ వర్గం నుంచి ముఖ్యమంత్రులయ్యారని, మరి ఏపీలో ఓబీసీ సీఎం ఎందుకు లేరంటూ నిలదీశారు.