చంద్రబాబు..లోకేష్ దావోస్ టూర్
విశాఖపట్నం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు , నారా లోకేష్ ఎవరిని ఉద్దరించేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానాకు బొక్క పడడం తప్పించింది వారి వల్ల రాష్ట్రానికి ఒనగూరించి ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. తమ స్వంత ఇమేజ్ పెంచుకునేందుకు అక్కడికి వెళ్లారు తప్ప మరోటి కాదన్నారు. ఇద్దరూ ఉత్తి చేతులతో తిరిగి వచ్చారంటూ ఫైర్ అయ్యారు.
దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ గా నిలిచిన చంద్రబాబు నాయుడు ఏం కష్టం చేసి సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టించిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
ఇప్పటికే వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశాడని, అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తనపై ఉన్నన్ని కేసులు ఎవరిపైనా లేవన్నారు. తమ నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు గుడివాడ అమర్నాథ్.