కోడంగల్ లోనే తేల్చుకుందాం..దా
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రాన్ని మోసం చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. రుణ మాఫీ, రైతు భరోసా ,పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అంటూ సీఎంకు సవాల్ విసిరారు.
ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దాం నువ్వే చెప్పు అంటూ సవాల్ విసిరారు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తానని ప్రకటించారు. నీ కొడంగల్ నియోజకవర్గమైనా సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తానన్నారు. నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతానని హెచ్చరించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఓ వైపు ఏపీ అక్రమంగా నీళ్లను తరలించుకు పోతుంటే నిద్ర పోతున్నావా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. జనం అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని బండ కేసి కొట్టడం ఖాయమన్నారు హరీశ్ రావు.