సీఎం కు సవాల్ విసిరిన హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎలాంటి చర్చకైనా, ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 11 కిలోమీటర్లకు పైగా తవ్వామన్నారు. తాను చేసింది తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నానని తెలిపారు. గతంలోనూ చిల్లర మాటలు మాట్లాడారని, పాలన చేతకాక ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. . ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తాను.. నేను చేసింది తప్పు అని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. మరి మీరు చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
ఎస్‌ఎల్‌బీసీలో పనులు చేయాలి కానీ మమ్మల్ని అంటే ఎలా అని మండిపడ్డారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోనూ ఇలానే మాట్లాడారని ఆరోపించారు. .తమకు అప్పగించండి మేము చేసి చూపిస్తాం అంటే వెనక్కి తగ్గారన్నారు. ఎస్‌ఎల్‌బీసీలో 10 రోజులైనా మృతదేహాలను వెలికి తీయక పోవడం దారుణమ్నారు. మీవల్ల కాకపోతే చెప్పండి మేము రెస్క్యూ చేసి చూపిస్తామన్నారు హరీశ్ రావు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై సీఎంకు అవగాహన ఏ మాత్రం లేదన్నారు.