NEWSTELANGANA

కాంగ్రెసోళ్లు ర‌జాకార్ల వార‌సులు – జ‌గ‌దీశ్ రెడ్డి

Share it with your family & friends

స‌మ‌ర యోధుల పేర్లు ఎత్తే అర్హ‌త లేదు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై సీరియ‌స్ అయ్యారు.

రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, బీఎన్ రెడ్డి లాంటి మహాత్ముల పేర్లు పలకడానికి కోమటిరెడ్డి కి, కాంగ్రెస్ పార్టీ కి అర్హత లేదన్నారు జ‌గ‌దీశ్ రెడ్డి. వాళ్ళ జీవితాంతం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ దొరల మీద, భూస్వాముల మీదనే కదా అని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి , అమ‌రులైన పోరాట యోధుల , స్వాతంత్ర స‌మ‌ర యోధుల అస‌లైన వారసులం తామ‌ని , రజాకార్ల వార‌సులు మీరంటూ నిప్పులు చెరిగారు జ‌గ‌దీశ్ రెడ్డి. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం, వాటిని అమ‌లు చేయ‌క పోవ‌డం మీకు మాత్ర‌మే చెల్లింద‌న్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ స‌ర్కార్ పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నీర్వీర్యం చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకే ద‌క్కుతుంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి. గెలిపించిన పాపానికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.