సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం
హైదరాబాద్ – మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతికి కేరాఫ్ అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లపాటు తెలంగాణ వనరులను కొల్లగొట్టారని, తాము నిజాయితీ పరులమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చిందని, రేపు కేటీఆర్ కూడా వెళ్లక తప్పదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు కూడా తప్పు చేశారని సంచలన ఆరోపణలు చేశారు కడియం శ్రీహరి. అందరిపై చాలా కేసులు ఉన్నాయని, ఇప్పుడు శుద్ద పూసల్లా మాట్లాడటం దారుణమన్నారు.
ఆ ఫ్యామిలీలో ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిన వారు కొందరు ఉంటే ఊచలు లెక్క బెట్టేందుకు సిద్దంగా మరి కొంతమంది ఉన్నారంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి. తాను ఏనాడూ అవకాశాల కోసం ఎవరినీ ప్రాధేయ పడిన దాఖలాలు లేవన్నారు. అవకాశాలే తన వద్దకు వచ్చాయని చెప్పారు.