నిప్పులు చెరిగిన కాకాణి గోవర్దన్ రెడ్డి
అమరావతి – మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించిన చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే మాజీ ఎంపీ వ్యవసాయం చేసుకుంటానంటూ చిలుక పలుకులు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహార శైలి నచ్చకనే జగన్ దూరం పెట్టారని అన్నారు. జగన్ ను టార్గెట్ చేస్తూ లోపాయికారిగా సీఎం చంద్రబాబు నాయుడుకు సాయం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి. అందుకే తనంతకు తానుగా పార్టీ నుంచి వెళ్లి పోయాడని ధ్వజమెత్తారు.
వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయి రెడ్డి అని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉంటారంటూ నిప్పులు చెరిగారు కాకాణి గోవర్దన్ రెడ్డి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయ సాయి రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో విజయ సాయి రెడ్డి ఇటీవలే తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ రెడ్డిని వీడడం బాధాకరమని అన్నారు. కాగా విజయ సాయి రెడ్డి క్లాస్ మేట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావడం విశేషం. మొత్తంగా వైసీపీ నేతలు మాజీ ఎంపీని టార్గెట్ చేయడం విశేషం.