ఎలాంటి గుండెపోటు రాలేదు
విజయవాడ – మాజీ మంత్రి కొడాలి నానికి గుండె పోటు వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని స్పష్టం చేసి వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశి భూషణ్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడ్డారని అన్నారు. అందుకోసమే ఆస్పత్రిలో చేరారని చెప్పారు. ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అంతా సవ్యంగానే ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. గుండె పోటు వచ్చినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఎవ్వరు ఆందోళన చెందవద్దని కోరారు.
ఇదిలా ఉండగా మాజీ మంత్రి కొడాలి నానికి ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో హైదరాబాద్ లో ఉన్న తనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు అన్ని పరీక్షలు చేపట్టారు. అయితే తనకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కుటుంబీకులతో పాటు పార్టీ నాయకులు, ఇతర శ్రేణులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. కొడాలి నానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ కలిగి ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జగన్ రెడ్డి సర్కార్ లో మంత్రిగా కూడా పని చేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , కుటుంబాలను అనరాని మాటలు అన్నారు.