లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలి
కర్ణాటక మాజీ మంత్రికేఎస్ ఈశ్వరప్ప డిమాండ్
కర్ణాటక – రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. శివ మొగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా శ్రీవారి ప్రసాదం కల్తీ జరిగిందన్న ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఈశ్వరప్ప.
గత ప్రభుత్వ హయాంలో జరిగిందని , దీనికి సంబంధించి బాధ్యుడైన అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిని, మాజీ టీటీడీ చైర్మన్లను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల దేవస్థానం ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగిస్తున్నారని ఆరోపణలు రావడం, సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఈశ్వరప్ప.
వెంటనే విచారణకు ఆదేశించాలని ఆయన సీఎంను కోరారు. గుజరాత్ కు చెందిన ప్రయోగశాలలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించినట్లు తేలడం పట్ల తాను షాక్ కు గురైనట్లు తెలిపారు. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కోట్లాది భక్తులు విస్మయానికి లోనైనట్లు తెలిపారు ఈశ్వరప్ప.
ఇదిలా ఉండగా టీటీడీ ఉపయోగించే నెయ్యి నమూనాల్లో కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదిక వెల్లడించం విశేషం. ఇదిలా ఉండగా జగన్ రెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈశ్వరప్ప.