నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి వేశారని, మాజీ ఎమ్మెల్యేపై కోమటిరెడ్డి గూండాలు పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతందని ధ్వజమెత్తారు కేటీఆర్. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుండడం పట్ల మండిపడ్డారు. ఇప్పటి వరకు దాడి చేసిన వారి పట్ల ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజా పాలన పేరుతో అన్ని వర్గాల వారిపై దాడులకు పాల్పడుతూ వస్తున్నా పట్టించు కోవడం లేదన్నారు కేటీఆర్. తమ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డిపై జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నానని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.