Saturday, April 5, 2025
HomeNEWSరేవ‌తి అరెస్ట్ అప్ర‌జాస్వామికం

రేవ‌తి అరెస్ట్ అప్ర‌జాస్వామికం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్

హైద‌రాబాద్ – సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ , ప‌ల్స్ యూట్యూబ్ ఛాన‌ల్ సీఈవో రేవతితో పాటు త‌న భ‌ర్త చైత‌న్య దంత‌లూరిని పోలీసులు అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది పూర్తిగా అప్రజాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న బుధ‌వారం స్పందించారు.

ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి ఎనుముల‌ రేవంత్ రెడ్డిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వీడియోను ఇటీవల రేవ‌తి నిర్వహిస్తున్న పల్స్ న్యూస్ బ్రేక్ డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. రేవ‌తి పొగ‌డ‌దండ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చి అకార‌ణంగా అదుపులోకి తీసుకున్నారనే ఆరోప‌ణ‌లున్నాయి.

ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నుండి సారాంశం అయిన వీడియో క్లిప్‌లో, ఛానెల్‌లో కనిపించిన ఒక వృద్ధుడు ముఖ్యమంత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments