Thursday, April 17, 2025
HomeNEWSస‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే బ‌క్వాస్

స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే బ‌క్వాస్

మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ మంత్రి కేటీఆర్. తాజా స‌ర్వే ..కుల గ‌ణ‌న స‌ర్వేల మ‌ధ్య తేడా వివ‌రించారు. 2014లో కుటుంబ సర్వే జరిగినప్పుడు బీసీల సంఖ్య 51 శాతంగా తేలిందన్నారు. తాజా స‌ర్వేలో కేవ‌లం 46 శాతం మాత్రమే ఉన్న‌ట్లు పేర్కొనడం దారుణ‌మ‌న్నారు. 51 శాతం నుంచి 46 శాతానికి ఎలా త‌గ్గిందంటూ ప్ర‌శ్నించారు. ఉత్త‌మ్ చెప్పిన వివ‌రాలే సీఎం వివ‌రించారంటూ ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై. ఇదే స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న గురించి. చెప్పుకోలేని రీతిలో కామెంట్ చేశాడ‌ని, మీ పార్టీకి చెందిన వ్య‌క్తి కూడా మీరు చేప‌ట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేను ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు స‌ర్వే చేప‌ట్టారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్.

ఎవ‌రిని మోసం చేసేందుకు ఈ స‌ర్వే తీసుకు వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌లో విశ్వాసాన్ని కోల్పోయింద‌న్నారు. ఈ మాత్రం దానికి అసెంబ్లీ స‌మావేశాలు ఎందుకు నిర్వ‌హించార‌ని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments