మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీనిపై సీరియస్ గా స్పందించారు . ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపించేందుకు ఉపయోగపడేలా ఉందంటూ ఆరోపణలు చేశారు. పదేళ్ల రథ చక్రానికి పంక్షర్ వేశారంటూ ఎద్దేవా చేశారు. రూ. లక్షల కోట్ల అప్పునకు టార్గెట్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. రూ. 6 వేల కోట్లు పార్టీ కార్యకర్తలకు పంచి పెడతారా అని ప్రశ్నించారు. యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను విస్మరించిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల గురించి ప్రస్తావన ఎక్కడ ఉందంటూ నిలదీశారు సర్కార్ ను. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే ఉద్దేశించి తయారు చేశారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. సొల్లు కబుర్లు తప్ప ఏ ఒక్కరికీ పనికి వచ్చే పని చేశారా అని పేర్కొన్నారు కేటీఆర్. తులం బంగారానికి దిక్కు లేదున్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ప్రస్తావన ఎక్కడుందన్నారు.