నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – తనకు న్యాయ స్థానంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎలాగైనా సరే తనను జైలుకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నాడని, కానీ ఆయన ఆటలు సాగవన్నారు. తనపై ఇప్పటికే ఆరు అక్రమ కేసులు బనాయించారని, ఎక్కడా ఏ ఆధారమూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కలేదన్నారు. రూ. 600 కోట్ల సంగతి పక్కన పెడితే ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏ ఒక్క పైసా కూడా పక్కదారి పట్టలేదన్నారు.
కుట్ర పూరితంగా ఎన్ని కేసులు బనాయించినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. తాను ఏ తప్పు చేయలేదని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం తను, తన కుటుంబం మాత్రమే బాగుండాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు .
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ కు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.