నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఓ వైపు నీళ్లు అందక పంటలు ఎండి పోతుంటే మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అందాల పోటీలు చేపడితే మీకు వచ్చిన బాధ ఏమిటంటూ మండిపడ్డారు. ఈ పోటీల వల్ల హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. పర్యాటక రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో మంత్రి జూపల్లి ఏకంగా ఈ పోటీల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పడం దారుణమన్నారు కేటీఆర్. ఇదిలా ఉండగా మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఓ వైపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి దాని ఊసెత్తకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. అందాల పోటీల నిర్వహణపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది తెలంగాణ సమాజం నుంచి. తాము అడ్డుకుంటామని ప్రకటించారు ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు.