NEWSANDHRA PRADESH

వైసీపీకి షాక్ సుచ‌రిత ఝ‌ల‌క్

Share it with your family & friends

త్వ‌ర‌లోనే తెలుగుదేశం తీర్థం

అమ‌రావ‌తి – రోజు రోజుకు వైసీపీని వీడుతున్న వాళ్లు ఎక్కువ‌వుతున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ త‌రుణంలో కీల‌క‌మైన ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కురాళ్లు ఆ పార్టీని వీడేందుకు సిద్దం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఆ పార్టీ వ‌ర్గాల‌లో.

ఇదిలా ఉండ‌గా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మేక‌పాటి సుచ‌రిత గుడ్ బై చెప్పారు. కొద్ది కాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సుచ‌రిత భ‌ర్త‌కు బాప‌ట్ల ఎంపీ సీటు ఇస్తాన‌ని మాట ఇచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌క పోవ‌డంతో తీవ్రంగా మ‌న‌స్తాపం చెందారు మేక‌పాటి సుచ‌రిత.

అంతే కాదు తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో సుచ‌రిత త‌న‌కు ప్ర‌త్తిపాడు నుంచి నిల‌బ‌డే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని భావించారు. అయినా అక్క‌డ కూడా నిరాశ ఎదురైంది. దీంతో రాష్ట్రంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించ‌ని రీతిలో టీడీపీ కూట‌మి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. సుచ‌రిత‌తో పాటు ఇప్ప‌టికే వైసీపీకి గుడ్ బై చెప్పారు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌. ఆమె లోకేష్ స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *