నేను ఎక్కడికీ పారిపోలేదు
నిప్పులు చెరిగిన పేర్ని నాని
అమరావతి – తమను అరెస్ట్ చేస్తారనే భయంతో తాము పారి పోయినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. తాము ఎక్కడికీ పారి పోలేదన్నారు. బాజాప్తాగా మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. కావాలని కక్ష సాధింపుతో కేసులు నమోదు చేస్తున్నారంటూ వాపోయారు. అమాయకురాలైన తన భార్య జయసుధను చిత్రహింసలకు గురి చేయడం సబబు కాదన్నారు పేర్ని నాని.
శనివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. తాను దొంగతనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఒకవేళ మీమీద కక్షతో ఆడవాళ్లపై కేసులు పెడితే మీరు రక్షించుకుంటారా లేదా అని ప్రశ్నించారు పేర్ని నాని.
తాను అక్రమంగా డబ్బులు సంపాదించ లేదని స్పష్టం చేశారు. తనకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయని చెప్పారు. రేషన్ మిస్సింగ్ వ్యవహారంలో తమకు, మా కుటుంబానికి ఏ పాపం పుణ్యం తెలియదన్నారు.
కావాలని తనపై కక్ష కట్టి ఏమీ తెలియని తన భార్య జయసుధను టార్గెట్ చేశారని, ఇది ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. ఈవిషయంపై చంద్రబాబు కూడా ఒప్పుకోలేదన్నారు. ఈ విషయం తనకు తెలుసన్నారు.