మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోష్
అమరావతి – మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేయడం బాధ కలిగించిందన్నారు. పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఇది ఊహించని పరిణామమని, ఒక రకంగా పార్టీకి భారీ నష్టం కలుగుతుందని చెప్పారు. వైసీపీకి వెన్నెముక లాంటి వాడని, అదే లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. తను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మొత్తంగా తను లేక పోవడం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. జగన్ రెడ్డితో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అప్రూవర్ గా మారే ప్రసక్తి లేదన్నారు. వెన్ను పోటు రాజకీయాలు తనకు తెలియవని అన్నారు.
భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనంటూ స్పష్టం చేశారు. తనకు ఎవరి పట్ల కక్ష లేదన్నారు. ఎవరినీ విమర్శించిన దాఖలాలు లేవన్నారు. కావాలని తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తన రాజీనామా విషయం గురించి పలుమార్లు తమ పార్టీ బాస్ తో చర్చించడం జరిగిందని చెప్పారు విజయ సాయి రెడ్డి.