నిప్పులు చెరిగిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం జిల్లా – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. పాడి రైతులను ప్రైవేట్ డెయిరీలు బహిరంగంగానే దోపిడీ చేస్తున్నా పట్టించు కోవడం లేదన్నారు. ధరలు లేక నష్ట పోతున్నారని వాపోయారు. తమ పాలనలో పాడి రైతులకు భరోసా కల్పించామన్నారు. ఆనాడు పాల ధరలను సర్కారే నిర్ణయించిందన్నారు. మహిళా డెయిరీ సంఘాలను ప్రోత్సహించిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీని నిలిపామన్నారు. దీని కారణంగా రూ. 5100 కోట్ల లాభం చేకూరిందన్నారు.
సోమవారం సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసినా పట్టించు కోక పోవడం దారుణమన్నారు సీదిరి అప్పలరాజు.