ఎస్ఎస్ఏ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా – రాష్ట్రంలోని సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
బోనాల ర్యాలితో నిరసన వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో బోనాలను సమర్పించారు. వేలాది మంది చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని అన్నారు శ్రీనివాస్ గౌడ్.
తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఎస్ఏలో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచడం జరిగిందని, మరోసారి గనుక పవర్ లోకి వచ్చి ఉంటే వారిని పర్మినెంట్ చేసి ఉండేవారమని అన్నారు . కానీ అనుకోకుండా కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిందన్నారు.
ఎందుకు ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదన్నారు వి. శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కే శ్రీనివాసులు, చంద్రశేఖర్, విష్ణువర్ధన్, యాదగిరి, మోగులయ్య, తిరుపతయ్య , తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు.